కృష్ణ: నున్న జడ్పీ హైస్కూల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సైక్లింగ్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు పోటీల నిర్వాహకులు రవికాంత ఓ ప్రకటన విడుదల చేశారు. పోటీలలో పాల్గొనే బాలబాలికలు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయిలు సంతకం చేసిన స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో ఎంపిక పోటీలకు హాజరు కావాలని ఆయన సూచించారు.