AP: విశాఖలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని లాసన్స్‌బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంపై ఈడీ దాడులు చేస్తోంది. భూదందాలు, పలు ఆర్థిక నేరాలతో ఎంవీవీకి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.