ASF: ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామ సమీపంలో పెద్ద వాగుకు వంతెన లేకపోవడంతో రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క బుధవారం నలినడకన గుండి వాగును దాటారు. గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వాగుపై వంతెన నిర్మాణం చేపడతామని మంత్రి గ్రామస్థులకు హామీ ఇచ్చారు. మంత్రి వెంట MLA కోవా లక్ష్మీ, కలెక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.