TG: హైడ్రా చర్యలతో అనేక మంది ఆందోళన చెందుతున్నారని మల్కాజ్గిరి BJP MP ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కువమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఎక్కువ ఇళ్లు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. HYDలో అనేక చెరువులు మాయమయ్యాయి.. చెరువులను విస్తరించి సుందరీకరణ పనులు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.