కృష్ణ: అంబారుపేట శ్రీ సత్యమ్మ తల్లి దేవస్థానంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించిన రథం ఊరేగింపును కన్నుల పండుగలా నిర్వహించారు. కార్యక్రమంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. ఎమ్మెల్యేకు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు.