WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నేడు విజయదశమి దసరా సందర్భంగా భక్తులు తెల్లవారుజామునుంచే ఆలయానికి చేరుకుంటున్నారు. భద్రకాళి అమ్మవారు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.