TG: 8 రోజులతో పోలిస్తే 9వ రోజు పేర్చే బతుకమ్మను తిరోక్క పూలతో పెద్దగా పేరుస్తారు. ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమె చనిపోయినా కలకాలం ప్రజల గుండెల్లో బతికే ఉంటుందని.. ‘‘బతుకమ్మా’’ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ.. స్త్రీలకు సంబంధించిన పండుగగా ‘బతుకమ్మ’ ప్రాచుర్యం పొందినట్లు ఓ కథ చెబుతుంటారు.