KDP: గండికోట పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ తెలిపారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి బుధవారం రాత్రి గండికోట నిర్వాసితులతో ఆమె సమావేశం నిర్వహించారు. పెండింగ్ పరిహారానికి వెంటనే నిధులు వచ్చేలా చూడాలని నిర్వాసితులు జేసీని కోరారు.