AP: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయం దగ్గర వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని మీడియాకు ప్రత్యేకంగా చూపించారు. సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో పుస్తకాన్ని రూపొందించినట్లు సమాచారం. రేపటి వారాహి సభలో పుస్తకంలోని అంశాలను ప్రజలకు తెలియజేయనున్నారు.