కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధికి మహర్దశ పట్టనుంది. ఈ మేరకు కృషి చేస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు. శుక్రవారం వాడపల్లిలో అన్న ప్రసాదశాలను పరిశీలించి అక్కడ పరిస్థితులను సత్యానందరావు అడిగి తెలుసుకున్నారు. దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.