ASR: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీలో కొండచరియలు, చెట్లు, రాళ్లు విరిగి పడి పలు రహదారులు ఛిద్రం అయ్యాయి. ధారకొండ వెళ్లే మార్గంలో వంతెన సమీపంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈమేరకు స్పందించిన గ్రామస్తులు శుక్రవారం సొంతంగా శ్రమదానంతో గుంతలను పూడ్చుతున్నారు. అనంతరం ఈ సమస్యలపై అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.