TG: నార్సింగి పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ కస్టడీ విచారణ కొనసాగుతుంది. మూడో రోజు బాధితురాలు స్టేట్మెంట్ను జానీ మాస్టర్ ముందుంచి పోలీసులు విచారిస్తున్నారు. అయితే బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ తెలిపారు. జానీ మాస్టర్‌ను కలిసేందుకు ఆయన భార్య నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రేపటితో జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుండటంతో.. రేపు ఉదయం కోర్టు ముందు ఆయన్ను పోలీసులు హాజరుపర్చనున్నారు.