ELR: చింతలపూడి మండలం సీతానగరం సమీపంలో ఉన్న గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీకి పామాయిల్ గెలలు సరఫరా చేస్తున్న లారీలు, ట్రాక్టర్లు అధిక లోడులతో ప్రమాదభరితంగా వెళ్తున్నాయని, అధిక లోడులు అరికట్టాలని ప్రజలు, ప్రయాణికులు ఆర్టీఏ అధికారులను కోరారు. గతంలో ఈ విషయంపై ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధిక సరఫరా నిలుపుదల చేయడంలో విఫలమయ్యారన్నారు.