NLR: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రారంభమైందని MLA సోమిరెడ్డి అన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆయన వెంకటాచలం మండలం ఎగువమిట్టలో బుధవారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. పేదల ఇంటి అవసరాల కోసం గ్రామాల్లో మట్టిని తరలిస్తుంటే వైసీపీ నాయకులు రాద్ధాంతం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.