ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20,000 పలికింది. క్వింటా కొత్త పత్తి ధర రూ. 7,211 అటు క్వింటా పాత పత్తి ధర రూ. 7,600 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్న ఈరోజు ఏసీ మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. అటు పాత పత్తి ధర రూ. 50 తగ్గగా. కొత్త పత్తి ధర రూ. 100 పెరిగినట్లు పేర్కొన్నారు.