బాపట్ల: జిల్లాలో ఎరువుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ తెలిపారు. మంగళవారం కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పంట నమోదు ప్రక్రియ ఈ నెల ఆఖరులోపు పూర్తిచేయాలని ఆదేశించారు. పంట నమోదు చేసిన ప్రతి రైతుకు ఈ కేవైసీ చేయాలని సూచించారు. కౌలు రైతులకు లోన్లు మంజూరు చేయించాలన్నారు.