AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమైన పత్రాలు కోల్పోయిన వారికి ఉచితంగా నకళ్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ శాఖలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని తెలిపింది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాల జారీకి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశాలు జారీ చేశారు. జీవో జారీ చేసిన మరుసటి రోజు నుంచి వారం పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు.