SRD: మునిల్లి మండలం నుంచి ఇతర మండలంలోని పాఠశాలకు ఉపాధ్యాయులను అక్రమంగా డిప్యూటేషన్ వేసిన డీఈవోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి సోమవారం వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై వేరే చోటకు నియమించారని చెప్పారు.