VZM: జిల్లాలో గత రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయని, వచ్చే రెండు వారాలపాటు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం వుందని కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని మండలాల తహసీల్దార్లు, నోడల్ అధికారులు అప్రమత్తంగా వుంటూ ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు.