AP: విశాఖ డెయిరీ యాజమాన్యంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారన్నారు. రైతుల సొమ్ములతో డెయిరీ పాలకవర్గం సోకులు చేస్తోంది.. అవసరమైతే ఛైర్మన్‌ను జైలుకు ఈడుస్తామని హెచ్చరించారు. సొసైటీల సొమ్ముతో షీలానగర్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేసి, రైతులకు నామమాత్రం చికిత్సలు అందిస్తున్నారని అన్నారు.