HYD: వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్లోని శిల్పారామంలో ప్రదర్శించిన కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఆదివారం శిల్పారామంలో రాయచూరుకు చెందిన రాఘవ నాట్యమృత కళానికేతన్ నాట్య గురువులు శ్రేయస్ జోషి, శిష్య బృందంచే ప్రదర్శించిన భరత నాట్యం ఆకట్టుకుంది. కళాకారులు శ్రేయస్, భవాని, కృతిక తదితరులు నృత్యాలు ప్రదర్శించి, ఆహుతులను ఆకట్టుకున్నారు.