NDL: గోస్పాడు మండలం శ్రీనివాసపురం గ్రామంలో దాదాపు 20 స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారాయని సీపీఐ మండల కార్యదర్శి హరినాథ్, నాయకులు చంద్ర, సుబ్బరాయుడు తెలిపారు. వర్షాలు కురవడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను సరిచేయాలని కోరారు.