అమెరికాలోని నస్సాన్ వెటరన్స్ కొలస్సియంలో ప్రవాస భారతీయుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..’భారత్ అవకాశాలకు స్వర్గధామం. భారతీయులు ఎక్కడ ఉన్నా సామాజిక, దేశాభివృద్ధికి దోహదపడతారు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులే భారత్కు బ్రాండ్ అంబాసిడర్లు. భారత్, USA దేశాలు ప్రజాస్వామ్యంలో భాగస్వాములయ్యాయి. కరోనా సమయంలో 150 కంటే ఎక్కువ దేశాలకు వ్యాక్సిన్లు పంపించాం’ అని అన్నారు.