AP: రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.