ప్రకాశం: బేస్తవారిపేటలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసిందని తెలియజేశారు. రైతులకు మేలు చేసే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే మా ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.