ప్రకాశం: దివంగత మాజీమంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద ఆంజనేయులు విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ.. మంత్రిగా దామచర్ల ఆంజనేయులు ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు.