MNCL: బెల్లంపల్లి మండలం పెద్ద బూదకు చెందిన మహేష్ (21) అనే యువకుడు శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు అతడిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అతడిని 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఈఎంటీ రాకేష్, పైలట్ సంపత్ తెలిపారు.