SRD: వికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమావేశంలో గౌరవ అధ్యక్షుడు మాణిక్ పాల్గొన్నారు.