SRPT: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్వేరో అధినేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం కోదాడ మండలంలోని కూచిపూడి, గణపవరం గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించి స్వేరో ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేసి మాట్లాడారు. వరదలతో పంట నష్టపోయిన రైతులను, ఇండ్లు దెబ్బతిన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.