PLD: క్రోసూరు మండలం 88 త్యాళ్లూరు గ్రామంలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని ప్రజలతో ముచ్చటించారు. ఇచ్చిన హామీ ప్రకారం రూ.3వేల పింఛన్‌ను రూ.4వేలు చేసిన ఘనత టీడీపీకే దక్కిందని అన్నారు. రానున్న రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు మొత్తం ప్రజలకు చేరువ అవుతాయని చెప్పారు.