VZM: విజయవాడ వరద బాధితుల సహాయార్థం అవనాపు విజయ్, అవనాపు భార్గవి రూ.50,000 చెక్కును విరాళంగా ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుకి ఆదివారం అశోక్ బంగ్లాలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.