BPT: ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కర్లపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టిపాటి శ్రీకృష్ణ పేర్కొన్నారు. కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో ఆదివారం స్వచ్ఛత హీ సేవా భారత్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.