తమ యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. త్వరలోనే ‘థీమ్ చాట్’ పేరిట కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు అనేక రకాల థీమ్‌లను తమ చాట్‌కు జోడించవచ్చు. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉందని వాట్సాప్ తెలిపింది. త్వరలో బీటా యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది.