పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్ నియమితులయ్యారు. సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి లోక్సభ ఎన్నికల అనంతరం PCC అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శుభాంకర్ను నియమిస్తూ AICC అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలు జారీ చేశారు. AICC కార్యదర్శిగా శుభాంకర్ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు.