NRML: వానల్పహాడ్ గ్రామంలోని ఎల్లమ్మ గుట్టపై ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చింత వృక్షం కాండంపై విజయ దుర్గామాత స్వయంభూ వెలసినట్లు గ్రామస్థులు తెలిపారు. స్వయంభూ వెలిసిన అమ్మవారిని చూడడానికి గ్రామస్థులు శనివారం భారీగా తరలివచ్చారు. ఇదివరకు ఎల్లమ్మ గుట్టపై ఆది మానవుల ఆనవాళ్లు లభ్యమైనట్లు చరిత్రకారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కటకం మురళీ తెలిపారు.