HYD: విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏడీఏ సాంబశివరావు ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పిల్లర్ నెంబర్ 32 నుంచి పిల్లర్ నంబర్ 45 వరకు గల జాందార్ నగర్, అయోధ్య నగర్, రేతిబౌలి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.