MNCL: సింగరేణి లాభాల వాటాలో కాంట్రాక్టు కార్మికులకు రూ.ఐదు వేలు ప్రకటించడం పట్ల శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 సీహెచ్పీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం యూనియన్ ఏరియా కార్యదర్శి ఎ. సమ్మిరెడ్డి మాట్లాడుతూ… కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా ఇవ్వడం హర్షణీయం అన్నారు.