KNR: చొప్పదండి మండలంలోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 23 వరకు అవకాశం ఉందని ఆ విద్యాలయ ప్రిన్సిపల్ మంగతాయారు శనివారం తెలిపారు. సీబీఎస్ఈ విధానంలో ఆరవ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.