ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్న సినిమా దేవర. RRR తరువాత రెండేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఎన్టీఆర్ ను బిగ్ స్క్రీన్ పై చూడలేదు అభిమానులు. RRR లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత మళ్ళీ అంతే భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్
కొరటాల శివ ఆచార్య డిసాస్టర్ తరువాత చేస్తున్న సినిమా ఇది. అయినా కూడా టీజర్ తోనే చాల హైప్ తీసుకొచ్చాడు ఈ సినిమాకి. సెప్టెంబర్ 27న రిలీజ్ కి రెడీ అవుతున్న దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నవిషయం తెలిసిందే. ఆయన షూటింగ్ ప్రారంభం దగ్గర నుండి యూనిట్ తో కలిసి షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరో విలన్ వచ్చి దేవర సెట్స్ లో చేరనున్నారు.
యానిమల్ తో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న బాబీ డియోల్ దేవర సినిమాలో మరో విలన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాబీ డియోల్ తో ఎక్కువ సీన్లు సెకండ్ పార్ట్ లోనే వుంటాయని తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చే సీన్స్ లో బాబీ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ తో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ. బాబీ డియోల్ ఆల్రెడీ బాలయ్య- బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
అనిరుధ్ ఇచ్చిన ఫియర్ సాంగ్ ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకి పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. కొరటాల శివ కి ఈ సినిమా చాలా కీలకం. ఆచార్య తర్వాత ఇంత భారీ సినిమా భాద్యత ఎన్టీఆర్ కొరటాలకు ఇవ్వడం మామూలు విషయం కాదు. కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.