ఏపీ ఎన్నికలు ముగిసి ఫలితాల అనంతరం నుంచి కొనసాగుతున్న చర్చ. వై ఎస్ జగన్ అసెంబ్లీ కి వస్తారా అని. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం రోజు కూడా ఈ చర్చ నడిచింది, కానీ, జగన్ అసెంబ్లీ కి వచ్చి ప్రామాణస్వీకారం చేసినవెంటనే వెళ్లిపోయారు. ఇప్పుడు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనే చర్చ మల్లి మొదలయ్యింది.
వాస్తవానికి జగన్ వినుకొండ పర్యటన తరువాత వైసీపీ క్యాడర్ లో కొంత ధైర్యం వచ్చిన మాట వాస్తవం. ఈ సమయంలో జగన్ అసెంబ్లీ లో కనిపించి స్వరం వినిపిస్తే వారికి మరికొంత ధైర్యమిచ్చినట్టు అవుతుంది.
కానీ వినుకొండలో జరిగిన అమానుష ఘటనపై, రాష్టంలో శాంతిభద్రతల గురించి ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి వినతిపత్రం అందించి, జాతీయ మీడియా కు తెలిసేలా 24వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలియజేసే కార్యక్రమానికి పిలుపునిచ్చారు వై ఎస్ జగన్. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది ఫ్రశ్నర్థకం గానే ఉంది. మరోవైపు ప్రతిపక్షనేత హోదా లేకుండా జగన్ కు అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం ఇస్తారా అనేవాళ్ళు కూడా ఉన్నారు.
ఐదు రోజులపాటు సాగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు లా అండ్ ఆర్డర్, ఎక్సయిజ్, ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.