»Donald Trump I Dont Want To Come In Front Of Everyone Like This
Donald Trump: ఇలా అందరిముందుకు వస్తాననుకోలేదు!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. దీంతో చెవికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే దీనిగురించి ట్రంప్ తాజాగా స్పందించారు.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. దీంతో చెవికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే దీనిగురించి ట్రంప్ తాజాగా స్పందించారు. ఆ దాడిలో చనిపోతానని అనుకున్నాను. అసలు మీ ముందు ఇలా ఉండేవాడినే కాదు. ఇదొక చిత్రమైన పరిస్థితి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆయన చెవికి బ్యాండేజ్ ఉంది. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదు.
కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైంది. నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందని ట్రంప్ తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత అధ్యక్ష రేసు ఏకపక్షమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తూటా తాకిన వెంటనే కిందకు వంగి, పిడికిలి బిగించి బలంగా పైకి లేచారు. అయితే ఇదంతా సానుభూతి కోసమా? ఆయన వ్యతిరేకులు కుట్ర సిద్ధాంతాలకు తెర తీశారా? అనేది స్పష్టంగా తెలియదు. ట్రంప్‌ను నమ్మలేమంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.