»Champions Trophy 2025 India May Not Travel To Pakistan Decision Rests With Government Says Report
Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల కోసం పాక్‌కి వెళ్లేదే లేదంటున్న బీసీసీఐ
భారత క్రికెట్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. అందుకు తగినట్లుగా వేదికలను మార్చాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Champions Trophy 2025 : భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల భద్రత తమకెంతో ముఖ్యం అని బీసీసీఐ తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy ) కోసం ఇండియన్ టీం పాక్‌లోకి వెళ్లేదే లేదని తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఈ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) ఇలా వ్యాఖ్యలు చేసింది. ఈ షెడ్యుల్కి అనుమతి తెలపలేనట్లు తెలుస్తోంది. ఆసియా కప్‌లో మాదిరిగానే భారత మ్యాచ్‌లను వేరొక వేదికకి మార్చాల్సిందిగా ఐసీసీకి ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇప్పటికే టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యుల్‌ని పాకిస్థాన్(Pakistan) సిద్ధం చేసింది. భారత్-పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లకు లాహోర్ స్టేడియంని కేటాయించింది. భారత్ టీంతో జరిగే మ్యాచ్‌లు అన్నీ అక్కడే జరుగుతాయని షెడ్యుల్‌లో పేర్కొంది. అయితే భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయేమో అని బీసీసీఐ యోచన చేస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా పాక్‌కు వెళ్లకూడదనే గట్టి నిశ్చయంతో ఉంది.
ఇండియన్ టీం(team India) టోర్నీలో ఆడేందుకు వీలుగా దుబాయ్, శ్రీలంకల్లో ఆ మ్యాచ్‌ల్ని ఏర్పాటు చేయాలని పట్టబడుతోంది. ఈ మేరకు ఐసీసీ( ICC) దగ్గర కండిషన్ పెట్టింది. అయితే ఐసీసీ నుంచి ఏం నిర్ణయం వెలువడుతుందో అని ఇప్పుడు బీసీసీఐ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఈ విషయంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని చెబుతున్నాయి. 2013లో భారత్ ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని(Champions Trophy ) దక్కించుకుంది. ఇప్పుడు రోహిత్ నాయకత్వంలో ఊపు మీద ఉన్న టీం ఇండియా మరోసారి బరిలో దిగనుంది.