»Today Young Girls Making Semi Nude Videos In Social Media For Money And Fame
Madhavi latha: డబ్బుల కోసం బట్టలు విప్పేసి అందాలు ఆరబోతలు
ఒకపుడు ఊర్లలో ఆనందం కోసం లేదా తనివి తీరని మగవాళ్ల లోపల ఉండే సంతోషాల కోసం టీవీలు ఫోన్లు లేని కాలంలో అప్పట్లో భోగం డ్యాన్సులు అని పెట్టేవాళ్లు. ఇప్పటికీ ఉన్నాయి అనుకోండి. సమాజంలో వారికి ఇప్పటికీ సరైన విలువ ఉండదు. వారిది కడుపు తిప్పలు, ఇపుడు సోషల్ మీడియాలో అమ్మాయిలు వారికంటే దారుణంగా.. బట్టలు విప్పేసి అందాలు ఆరబోతలు, అసభ్యకరమైన కామెంట్స్ ఎన్ని వస్తే అంత వాళ్ల పేజి వ్యూస్ పెరుగుతాయి.
Today Young Girls Making Semi nude videos in Social media For money and Fame
Madhavi latha: హీరోయిన్ మాధవిలత గురించి చాలా మందికి తెలుసు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు ఏవి చేయడం లేదు కానీ తనదైన మాటలటో, వీడియోలతో సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంది. తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఫేస్ బుక్లో నేటి అమ్మాయిల గురించి ఘాటుగా స్పందించారు. అమ్మాయిలు చేస్తున్న వింతపోకడలను, నెట్టింట్లో వారు చేసే వ్యవహారాలను సూటిగా నిలదీశారు. మాధవిలత ఏం రాశారో ఇప్పుడు చూద్దాం.
“ఒకపుడు ఊర్లలో ఆనందం కోసం లేదా తనివి తీరని మగవాళ్ల లోపల ఉండే సంతోషాల కోసం టీవీలు ఫోన్లు లేని కాలంలో
అప్పట్లో భోగం డ్యాన్సులు అని పెట్టేవాళ్లు. ఇప్పటికీ ఉన్నాయి అనుకోండి. సమాజంలో వారికి ఇప్పటికీ సరైన విలువ ఉండదు.
వారిది కడుపు తిప్పలు, ఇపుడు సోషల్ మీడియాలో అమ్మాయిలు వారికంటే దారుణంగా.. బట్టలు విప్పేసి అందాలు ఆరబోతలు,
అసభ్యకరమైన కామెంట్స్ ఎన్ని వస్తే అంత వాళ్ల పేజి వ్యూస్ పెరుగుతాయి. బ్రాండింగ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి.
నాకు ఇప్పటికీ అర్థం కానిది వాళ్ల తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చుట్టాలు ఎవరు చూడరా అడగరా చెప్పరా? వదిలేసారా ?
సినిమాల్లో చేస్తే బూతు.. మరి ఫోన్లో చేస్తే స్వేచ్ఛనా? అంతటితో ఆగుతున్నారా, పెళ్లి అయిన వాళ్లు, పిల్లలు ఉన్నవాళ్లు.. పైకి పతివ్రత కబుర్లు. కట్టు బొట్టు బాగానే ఉంటది. పరాయి మగవాళ్లకి ప్రేమ రాయబారాలు. సోషల్ మీడియా పరిచయాలు.
వాట్సాప్ వరకు అవి ప్రేమలా ? కామం అంటారు సర్. ఒళ్లు బలుపు . లవ్ యు చెప్పుకుంటే ప్రేమ అయిపోతుందా ?
ఇన్నాళ్లు ? సమాజం ఏమైపోతుంది. ఎటు పోతుంది అంటూ సొల్లు కబుర్లు చెప్పే మగ యదవలు, ఆడముండలు వాళ్లు నడిపేది అవే రంకు. కానీ ఆ రంకు కి ప్రేమ అనే పేరు.. నక్కకి పులి మచ్చలు పెట్టినట్లు.
మగవాళ్ల తప్పేం ఉంది. సహజంగా 80% మగవాళ్లు ఆడవారి అందాలకి, మాటలకి లొంగిపోతారు. ఆడవాళ్లు ఏం చేస్తున్నారు?
అమ్మానాన్నల భయం లేదు. మొగుడి భయం లేదు, పిల్లల బాధ్యత లేదు అన్ని వదిలేసారు …. అసహ్యంగా ఉంది.
ఒకవైపు బట్టలిప్పిన ఆడవాళ్లు, మరోవైపు పెళ్లి పిల్లలు ఉండి సమాజంలో సంప్రదాయిని, సుద్ద పూసలుగా పేర్లు..
నాకు చిరాగ్గా ఉంది. మొగుడు ఎవర్తినో పోతాడు. పెళ్ళాం ఎవడితోనో పోతది. వాటి పేరు ప్రేమ.. తు మీ బతుకులు.. సచ్చిపోండి.. మీరంతా.
ఇంకో రకం సమాజం చీర కడితే సావిత్రి అనుకుంటారు. అంత లేదు చీర, కట్టు, బొట్టు పెట్టి పది మందితో ఫోన్లో సరసాలు.. వాటి పేరు ప్రేమ అని చెప్పే సుప్పినీలు. ఆడవాళ్లు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని సోది చెప్పే మగవాళ్లు. ఇలాంటి వాళ్లతో సంబంధాలు
కర్మకి దాని పేరు కూడా ప్రేమ అంత బంధం, అంత అనుబంధం అంట ఎంటో ఈ పాడు లోకం.” అంటూ రాసుకొచ్చారు.
నిజానికి మాధవిలత రాసినదాంట్లో ప్రతీది నిజమే అనిపిస్తుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. అందరూ రీల్స్ పేరిట నచ్చిన పనులు చేసి పోస్ట్ చేస్తున్నారు. పద్దతి అనేది ఎప్పుడో చెరిగిపోయింది. ఇలాంటి వాటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు. సమాజమే కదా. మరి వీటిని ఎవరు అదుపు చేయాలి. ఇప్పటికైతే ఇది ఇంకా క్వశ్చన్ మార్కే. ఇప్పటికైన ఒక వ్యక్తి సోషల్ మీడియా వింతపోకడలను ప్రశ్నించారు. మరీ ఈ ప్రస్థావన ఇక్కడితో ఆగిపోతుందా.. చర్చల రూపంలో ఇంకా ముందుకు వెళ్తుందా అనేది చూడాలి.