»Mister Bachchan Ravi Teja Mr Bachchan Who Targeted Devara
Mister Bachchan: ‘దేవర’ను టార్గెట్ చేసిన రవితేజ ‘మిస్టర్ బచ్చన్’?
మాస్ మహారాజా రవితేజ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా రిలీజ్ టార్గెట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
Mister Bachchan: Ravi Teja 'Mr Bachchan' who targeted 'Devara'?
Mister Bachchan: చివరగా ‘ఈగల్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం హరీశ్‌శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేక్‌గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి పెద్ద ఫ్యాన్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
వాస్తవానికైతే ఈ దసరాకు అక్టోబర్ 10న ఎన్టీఆర్ ‘దేవర పార్ట్ 1’ రావాల్సి ఉంది. కానీ పవన్ ఓజి పోస్ట్ పోన్ అవడంతో.. దేవర సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అయింది. దీంతో ఇప్పుడు దేవర డేట్ అక్టోబర్ 10ని మిస్టర్ బచ్చన్ టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దసరా రేసులో రజనీ కాంత్ వెట్టైయాన్ ఉంది. కానీ ఇది డబ్బింగ్ సినిమా. దీంతో.. ప్రస్తుతానికి తెలుగులో దసరా స్లాట్ ఖాళీగానే ఉంది. అందుకే.. మిస్టర్ బచ్చన్‌ను రేసులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. పోయిన దసరాకు టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి దసరాకు దూసుకొస్తున్నాడు మాస్ రాజా. మరి మిస్టర్ బచ్చన్ ఏం చేస్తాడో చూడాలి.