సలార్ టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే సలార్ టీజర్ వస్తోంది.. అనేమాట విన్నప్పుడల్లా డార్లింగ్ ఫ్యాన్స్ చెవులు కోసుకుంటున్నారు. కానీ తమ హీరోకి ప్రశాంత్ నీల్ ఇవ్వబోయే ఎలివేషన్‌ను ఊహించుకుంటునే కాలం వెల్లదిస్తున్నారు. సలార్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయినా ఇప్పటి వరకు స్టిల్స్ తప్పితే చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేయలేదు. చాలా రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ.. సలార్ టీజర్ డేట్ ఫిక్స్ అయిందని అంటున్నారు. అసలు ఈ న్యూస్ ఎక్కడి నుంచి, ఎలా లీక్ అయిందో తెలియదు గానీ.. టీజర్ డేట్ మాత్రం వైరల్ అవుతోంది. ఏప్రిల్ 2న సలార్ టీజర్ రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఉన్నట్టుండి.. ఆ రోజే ఎందుకు సలార్ టీజర్ రిలీజ్ చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు.. ఏప్రిల్‌లో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. అందుకే ఏప్రిల్‌లో టీజర్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే కారణాలు ఏమైనా.. టీజర్ వస్తే చాలని అంటున్నారు డార్లింగ్ అభిమానులు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక సలార్ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. హోంబలే ఫిలింస్ 200 కోట్ల బడ్జెట్‌తో.. కెజియఫ్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. మరి ఇప్పటికైనా సలార్ టీజర్ ఉంటుందేమో చూడాలి.