Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 6th)..రుణప్రయత్నాలు చేస్తారు.
ఈ రోజు(2024 June 6th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధు, మిత్రులతో గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభాలు ఉన్నాయి. సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.
వృషభం
కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. సహనం వహించడం మేలు. దగ్గరివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేస్తారు.
మిథునం
ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పులు ఉండవు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. పిల్లలపట్ల జాగ్రత్త వహించాలి.
కర్కాటకం
అనుకోని ధనలాభంతో ఆనందిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కొత్తఇంటి కలపై శ్రద్ధవహిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
సింహం
నూతన వ్యక్తులను నమ్మరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడాలి. మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి. రుణప్రయత్నాలు చేస్తారు.
కన్య
మనస్సు చంచలంగా ఉండడం వలన ఇబ్బందులు వస్తాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలు ఉన్నాయి. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి.
తుల
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉన్నాయి. అప్పుకోసం ప్రయత్నిస్తారు.
వృశ్చికం
విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్త.
ధనుస్సు
కుటుంబ కలహాలు ఉండవు. మంచి పనులు మాత్రమే చేయాలి. మొదలు పోట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. అందరితో స్నేహంగా ఉండాలి.
మకరం
తోటి ఉద్యోగులు మీ సహయాన్ని కోరుతారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి.
కుంభం
కొత్త వస్తువులు, ఆభరణాలను పొందుతారు. మీ మంచి ప్రవర్తనను ఆదర్శంగా తీసుకుంటారు. మొదలుపెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
మీనం
కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతారు. సన్నిహితులను దూరం చేసుకోరాదు.