»Lok Sabha Election Result 2024 Clash Erupts Between Sp And Bjp Workers In Lucknow One Man Injured
Loksabha Elections : లక్నోలో ఎస్పీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు బీజేపీకి గట్టిపోటీనిచ్చాయి.
Loksabha Elections : 2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు బీజేపీకి గట్టిపోటీనిచ్చాయి. చాలా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అయితే, రాష్ట్ర రాజధాని లక్నోలో ఓట్ల లెక్కింపు సందర్భంగా బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది.
గొడవ ఎందుకు జరిగింది?
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం లక్నోలో ఎన్నికల కౌంటింగ్ వేదిక దగ్గర సమాజ్‌వాదీ పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. లోక్‌సభ ఎన్నికల ట్రెండ్‌పై చర్చ అనంతరం ఈ ఘర్షణ జరిగింది. ఎస్పీ, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు గాయపడ్డాడు.
ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?
ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఎస్పీ, కాంగ్రెస్ కూటమి బీజేపీపై ఆధిక్యం సాధించింది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్పీ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 33, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇది కాకుండా ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.