Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 4th)..మనోనిగ్రహానికి ప్రయత్నించాలి
ఈ రోజు(2024 June 4th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. కొత్త వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైరసాహసాలతో ముందుకు వెళ్తారు. అనుకోని ధనలాభం ఏర్పడుతుంది.
వృషభం
స్థానచలనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగత్తగా మెలగడం మంచిది. ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అనారోగ్యబాధలు ఉంటాయి.
మిథునం
వ్యాపార రంగంలోనివారు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు ఉన్నాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అనవసర భయానికి గురి అవుతారు.
కర్కాటకం
సన్నిహితులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో మార్పును కోరుకుంటారు.
సింహం
కోరుకునేది ఒకటైతే జరిగేది ఇంకోటి. అనారోగ్య బాధలు ఉన్నాయి. వేళప్రకారం భుజించడం మంచిది. చంచల మనస్థత్వం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల శ్రద్ధ అవసరం.
కన్య
స్త్రీల వలన ధనలాభం ఉంటుంది. అనుకోని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీమీరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసలకు గురి అవుతారు.
తుల
శుభవార్తలు వింటారు. మీమీరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. సన్నిహితులను కలుస్తారు.
వృశ్చికం
ప్రధానమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆకస్మిక భయాందోళనలు ఉన్నాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి కోరుకుంటారు.
ధనుస్సు
శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ధనలాభం ఉంది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. తలపెట్టిన పనులను సులభంగా నెరవేర్చుకుంటారు.
మకరం
కొత్తపనులను ఆలస్యంగా ప్రారంభిస్తారు. సమయానికి భోజనం చేయకపోవడం వలన అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని వేధిస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండాలి.
కుంభం
కొత్త వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి.
మీనం
కీర్తి, ప్రతిష్ఠలు మెరుగౌతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రుణబాధలు ఉండవు. శత్రుబాధలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది.