»Delhi Water Crisis Atishi Srote Letter And Appealed To Cm Yogi Adityanath And Nayab Singh Saini For Additional Water Support
Water Crisis : ఢిల్లీలో నీటి కొరత.. యూపీ, హర్యానా సీఎంలకు మంత్రి అతిషి లేఖ
ఒకవైపు ఉక్కపోత, మరోవైపు నీటి కొరత. ఇదీ ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతుండడంతో ఢిల్లీ ప్రజలు ఎండ వేడిమితో పాటు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.
Water Crisis : ఒకవైపు ఉక్కపోత, మరోవైపు నీటి కొరత. ఇదీ ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతుండడంతో ఢిల్లీ ప్రజలు ఎండ వేడిమితో పాటు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీలకు ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి లేఖ రాశారు. ఢిల్లీకి నెల రోజుల పాటు అదనపు నీటిని విడుదల చేయాలని ఆమె ఈ లేఖలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థించారు. దీనికి ముందు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అలాంటి విజ్ఞప్తి చేశారు.
అతిషి లేఖలో ఏం రాశారు ?
ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిషి, సీఎం యోగి ఆదిత్యనాథ్, సీఎం నయాబ్ సింగ్ సైనీలకు రాసిన లేఖలో, “ఢిల్లీ ప్రస్తుతం నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ఉష్ణోగ్రత రోజురోజుకు మరింత పెరుగుతుంది. ప్రతి రోజు 50డిగ్రీల కంటే ఎక్కువ నమోదవుతుంది. దీంతో నీటి డిమాండ్ భారీగా పెరిగింది. రాష్ట్రంలో నీటి సంక్షోభం తలెత్తిందని మీకు తెలియజేస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు.
అతిషి ఈ విజ్ఞప్తి చేశారు
ఈ సంక్షోభ సమయంలో ఒక నెల పాటు అదనపు నీటిని విడుదల చేయాలని యుపి, హర్యానాకు విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. మానవుల మనుగడకు నీరు చాలా అవసరం. స్వచ్ఛమైన నీరు దేశంలోని ప్రతి పౌరుడి హక్కు. మన ప్రాచీన గ్రంథాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం గొప్ప పని అని మన ప్రాచీన గ్రంథాలలో పేర్కొన్నారు. సార్, మా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ఒక నెల పాటు అదనపు నీటిని విడుదల చేయాలని, తద్వారా వేడిగాలులను నివారించవచ్చని ఈ లేఖ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సానుకూల సమాధానం కోసం ఢిల్లీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటూ రాసుకొచ్చారు.