శర్వనంద్, కృతి శట్టి జంటగా నటిస్తున్న మనమే చిత్ర ట్రైలర్ విడుదల అయింది. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో ట్రైలర్లో క్లియర్‌గా చెప్పేశాడు. మరీ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
Maname: తెలుగు పరిశ్రమలో క్లీన్ హీరోలో వరుసలో శర్వానంద్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఆయన సినిమాలు మాత్రమే కాదు తాను కూడా చాలా ప్యూర్‌గా ఉంటాడు. గత కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక అందాల భామ కృతి శెట్టికి సైతం మంచి బ్రేక్ కావాలి. ఈ నేపథ్యంలో ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ మనమే. కుటుంబ కథ ఎమోషనల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్లో హీరోహీరోయిన్ల మధ్య డైలాగ్స్, హీరో కామెడీ టైమింగ్ బాగున్నాయి. ఇద్దరు కలిసి ఓ బాబును పెంచుతున్నట్లు ఇందులో చూపించారు. దానిపైనే ఎమోషనల్ డైలాగ్స్ సైతం ఉన్నాయి. మరీ ఆ బాబు ఎవరు, వీరిద్దరి కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ట్రైలర్ చూస్తే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. హేశం అబ్దుల్ వహాబ్ అందించిన బీజీఎం ఆకట్టుకుంటుంది. విభిన్న సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారంటే ఏదో కిక్ ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.